
అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.
అదేవిధంగా ఇంగ్లండ్ టూర్‌లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగిన ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు సాయిసుదర్శన్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ మరో అవకాశమిచ్చింది. మరోవైపు విండీస్ తరపున ఖరీ పియర్, జోహన్ లేన్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.
తుది జట్లు
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్‌పాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (సి), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్