
WC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
ICC Cricket World Cup 2023- India vs Australia: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా చెన్నైలో తమ తొలి మ్యాచ్ ఆడుతోంది. ఆస్ట్రేలియాతో ఆదివారం చెపాక్ వేదికగా మొదలైన ఈ మెగా పోరులో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేస్తోంది. డెంగ్యూ ఫీవర్ కారణంగా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ జట్టుకు దూరం కాగా.. ఇషాన్ కిషన్ తుది జట్టులో స్థానం సంపాదించాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుత వరల్డ్‌కప్ జట్టులో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో చెపాక్‌లో సెంచరీ చేసిన రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు(అక్టోబరు 8) కూడా కింగ్ అదే ఫీట్ రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటుండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
కోహ్లి డకౌట్ కావాలని కోరుకుంటున్నా
ఆస్ట్రేలియాతో చెపాక్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌లో కోహ్లి డకౌట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. బొరియా మజూందార్ షోలో క్లార్క్ మాట్లాడుతూ.. ‘‘అవును.. నేను నిజమే చెబుతున్నా.. మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో కోహ్లి డకౌట్ అయితే చూడాలని ఉంది.
ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ అతడు 100 కొట్టినా పర్లేదు. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి వస్తే మాత్రం సెంచరీ కొట్టకూడదనే మళ్లీ కోరుకుంటా. అప్పుడు కూడా కోహ్లి డకౌట్ కావాలి’’ అని వింత వ్యాఖ్యలు చేశాడు. అయితే, అదే సమయంలో కోహ్లిపై ప్రశంసలు కూడా కురిపించాడు.
క్లాస్ బ్యాటర్ అంటూ ప్రశంసల జల్లు
‘‘క్లాస్ బ్యాటర్. జీనియస్.. గొప్ప యోధుడు. వన్డేల్లో అతడు అత్యుత్తమంగా ఆడగలడు. టెస్టు, టీ20 ఫార్మాట్‌లోనూ అదరగొట్టినా.. వన్డే క్రికెట్‌లో వన్స్ ఇన్ లైఫ్‌టైమ్ ప్లేయర్ అంటే కోహ్లినే’’ అని క్లార్క్.. కోహ్లిని కొనియాడాడు. కాగా వన్డే ఫార్మాట్లో కోహ్లి ఇప్పటి వరకు 13 వేలకు పైగా(13950) పరుగులు సాధించాడు. ఇందులో 47 సెంచరీలు ఉన్నాయి.
ఫ్యాన్స్ ఫైర్.. పిచ్చిగా వాగితే
కాగా క్లార్క్ వ్యాఖ్యలపై కోహ్లి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘చెత్త మాటలు మాట్లాడకు.. మీ జట్టు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు. అంతేగానీ మా కింగ్ డకౌట్ కావాలంటూ పిచ్చిగా వాగితే అస్సలు బాగోదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2015లో ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్ ఘనత వహించాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి భారత క్రికెటర్‌గా