చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి భారత క్రికెటర్‌గా | Virat Kohli Sets New Record in world cup | Sakshi
Sakshi News home page

World cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి భారత క్రికెటర్‌గా

Oct 8 2023 2:40 PM | Updated on Oct 8 2023 5:31 PM

Virat Kohli Sets New Record in world cup - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యధిక క్యాచ్‌లు(వికెట్‌ కీపర్‌ కాకుండా) పట్టిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాపై మిచిల్‌ మార్ష్‌ క్యాచ్‌ను అందుకున్న విరాట్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో కోహ్లి 15 క్యాచ్‌లు అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(14) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు.
చదవండి: CWC 2023 India vs Australia: బుమ్‌ బుమ్‌ బుమ్రా.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement