
డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9-మార్చి 13 వరకు సిరీస్ జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అయితే తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో గాయపడిన ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తన చేతి వేలి గాయం నుంచి పూర్తిగా ఇంకా కోలుకోలేదు.
అయితే గ్రీన్ ప్రస్తుతం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో గ్రీన్ గాయం సంబంధించిన రిపోర్ట్‌లను వైద్యబృందం పరిశీలించాక తుది నిర్ణయం తీసుకున్నానమని ఆసీస్ హెడ్ కోచ్ మెక్‌డొనాల్డ్ తెలిపారు.
"గ్రీన్ చేతి వేలి గాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోనున్నాం. అతడి రిపోర్టులు వచ్చాక ఓ నిర్ణయం తీసుకోనున్నాం. నాకు తెలిసినంతవరకు అతడు బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. బౌలింగ్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నాను.
అయితే అతడు మా జట్టులో స్పెషలిస్టు బ్యాటర్. కాబట్టి మేము తొలి ప్రాధన్యత అతడి బ్యాటింగ్‌కే ఇస్తాము. అయితే తొలి టెస్టుకు ఇంకా మాకు చాలా సమయం ఉంది. అతడు పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి జట్టులో చేరతాడని ఆశిస్తున్నాను" అని మెక్‌డొనాల్డ్ విలేకురల సమావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: 'హార్దిక్ వద్దు.. టీమిండియా వన్డే కెప్టెన్సీకి వారిద్దరే సరైనోళ్లు'