Womens FTP: మూడు సంవత్సరాల్లో 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. ఎవరితో ఎవరు?

ICC Reveal Womens FTP 301 International Games Schedule Between 2022-25 - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తొలిసారి మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌(ఎఫ్‌టీపీ)ను మంగళవారం విడుదల చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్‌ 2025 కాలానికి గానూ మహిళా క్రికెట్‌ జట్లు ఆడబోయే సిరీస్‌లు, మెగాటోర్నీ వివరాలను ఎఫ్‌టీపీలో పేర్కొంది. ఇందులో 2023 వన్డే వరల్డ్‌ కప్‌తో పాటు మొత్తంగా 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టి20లు ఉన్నాయి.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే టెస్టులు ఆడనున్నాయి. ఇతర జట్లు ఎక్కువగా టి20లవైపే మొగ్గుచూపాయి. ఇక మహిళా క్రికెట్‌లో ఎఫ్‌టీపీ షెడ్యూల్‌ రూపొందించడం ఒక అద్భుతం ఘట్టం. ఎఫ్‌టీపీ అనేది కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే గాక మహిళల క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నాం. గతంలో కివీస్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో పలుమార్లు హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. అందుకే ఎఫ్‌టీపీలో మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించాం అని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ వసీమ్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

ఇక ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మహిళా చాంపియన్‌షిప్‌(IWC)లో భాగంగా 10 జట్లు వన్డే సిరీస్‌లు ఆడనున్నాయి. దీంతో భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం అన్ని జట్లకు ఉండనుంది. 

పాకిస్తాన్‌ మినహా మిగతా 9 దేశాలతో మ్యాచ్‌లు..
2022-25 కాలానికి గాను ప్రకటించిన ఎఫ్‌టీపీలో టీమిండియా మహిళల జట్టు ఒక్క పాకిస్తాన్‌ మినహా మిగతా తొమ్మిది దేశాలతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రై సిరీస్‌లు ఉన్నాయి. అలాగే 2023 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఒక్కో టెస్టు మ్యాచ్‌ ఆడనుంది.

2022-25 కాలంలో టీమిండియా మహిళలు ఆడనున్న ద్వైపాక్షిక సిరీస్‌లు..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది.
డిసెంబర్‌ 2022లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌
వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రకా, న్యూజిలాండ్‌తో ట్రై సిరీస్‌లో ఆడనున్న టీమిండియా నాలుగు టి20లు ఆడనున్నాయి

2023 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు
స్వదేశంలో సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2023లో దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు వన్డేలు

న్యూజిలాండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు
డిసెంబర్‌ 2023లో ఇంగ్లండ్‌తో ఒక టెస్టు, మూడు టి20లు

డిసెంబర్‌ 2023లోనే ఆస్ట్రేలియాతో ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు
నవంబర్‌ 2024లో ఆసీస్‌తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేలు
డిసెంబర్‌ 2024లో విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు
జనవరి 2025లో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు

2022-25లో జరగనున్న ఐసీసీ మెగాటోర్నీలు
ఫిబ్రవరి 2023 - దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్
సెప్టెంబర్ / అక్టోబర్ 2024 - బంగ్లాదేశ్‌ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్
సెప్టెంబర్ / అక్టోబర్ 2025 - భారత్‌ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్

చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త

ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top