
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌లో భాగంగా గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 10–15, 14–16, 15–17తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ జట్టు మూడో మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొత్తంలో హైదరాబాద్ 39 పాయింట్లు సాధించగా... ఇందులో సొంత సరీ్వస్‌లో 10 పాయింట్లు, స్పైక్ షాట్‌లతో 17 పాయింట్లు వచ్చాయి.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనా రెడ్డి ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ యజమాని కంకణాల అభిõÙక్ రెడ్డి వీరిద్దరికి స్వాగతం పలికి ఆటగాళ్లను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని... దేశంలోని పలు నగరాల్లో జరగాల్సిన ఈ సీజన్ పీవీఎల్ పోటీలు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహించడానికి చొరవ తీసుకున్న హైదరాబాద్ జట్టు యజమాని అభిక్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్ డిఫెండర్స్ 12–15, 15–12, 15–12, 16–14తో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్‌పై గెలిచింది.