
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచుస్తోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాక్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టు సూర్యకుమార్ కుమార్ యాదవ్ సారథ్యంలో ఈ టోర్నీ బరిలోకి దిగనుండగా.. ప్రత్యర్ధి పాక్ జట్టు సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో ఆడనుంది. ఈ ఈవెంట్ కోసం పాక్ తమ సన్నాహకాలను ప్రారంభించింది. ఆసియాకప్ ఆరంభానికి ముందు యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో పాక్ ట్రైసిరీస్ ఆడనుంది.
ప్రస్తుతం పాక్ జట్టు దుబాయ్‌లోని ఐసీసీ ఆకాడమీలో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా ఆసియాకప్‌లో భారత్-పాక్ జట్లు రెండు సార్లు తలపడే అవకాశముంది. మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ గ్రీన్ గ్రూపు-ఎలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సూపర్ 4కి అర్హత సాధించి సెకెండ్ రౌండ్‌లో మళ్లీ తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరిగే రెండు మ్యాచ్‌ల్లో విజయం తమదే థీమా వ్యక్తం చేశాడు.
"ఐసీసీ ఆకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న హ్యారీస్ రవూఫ్‌ను ఓ అభిమాని భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి అడిగాడు. భారత్ జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలుపు మాదే అంటూ రవూఫ్ బదలిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు రవూఫ్ కౌంటిరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే ముందు యూఏఈ పై గెలవండి అంటూ" ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కాగా గ్రూపు-ఎలో భారత్, పాక్‌తో పాటు యూఈఏ, ఒమన్ కూడా ఉన్నాయి. ఇక ఆసియాకప్ లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఆసియాకప్ టోర్నీ(వన్డే, టీ20)లో దాయాదులు ఇప్పటివరకు ముఖాముఖి 18 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా పదింట విజయం సాధించగా.. పాక్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఆసియా కప్ కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మరియు రింకు సింగ్.
ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టు
సల్మాన్ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్‌జాదా ఫర్హాన్, సామ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిది ,సుఫియాన్ ముఖీమ్.
చదవండి: 1258 బంతులు.. 521 పరుగులు.. ఆ స్టయిలే వేరు!.. వారసుడు ఎవరో?