రష్మిక , స్మృతి శుభారంభం | Good start Rashmika and Smriti | Sakshi
Sakshi News home page

రష్మిక , స్మృతి శుభారంభం

Oct 9 2024 4:03 AM | Updated on Oct 9 2024 4:03 AM

Good start Rashmika and Smriti

మైసూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక , స్మృతి భాసిన్‌ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రష్మిక 7–5, 6–1తో సోనల్‌ పాటిల్‌ (భారత్‌)పై నెగ్గగా... స్మృతి 4–6, 6–0, 6–2తో ఐదో సీడ్‌ కరోలాన్‌ డెలానే (ఫ్రాన్స్‌)పై సంచలన విజయం సాధించింది.

తెలంగాణకే చెందిన మరో ప్లేయర్‌ హుమేరా బహార్మస్‌ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో హుమేరా 7–5, 6–4తో అమోదిని నాయక్‌ (భారత్‌)పై గెలిచింది. డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్‌)–కరోలాన్‌ డెలానే (ఫ్రాన్స్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో శ్రావ్య శివాని–కరోలాన్‌ ద్వయం 7–6 (7/3), 6–3తో శ్రీనిధి బాలాజీ–హర్షిణి నాగరాజ్‌ (భారత్‌) జంటను ఓడించింది.    

Advertisement
 
Advertisement
Advertisement