భారత్‌ను గెలిపించిన మనిక  | First win for Indian womens team in TT Championship | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన మనిక 

Feb 19 2024 3:41 AM | Updated on Feb 19 2024 3:41 AM

First win for Indian womens team in TT Championship - Sakshi

బుసాన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టుకు తొలి విజయం లభించింది. హంగేరితో ఆదివారం జరిగిన గ్రూప్‌–1 రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–2తో గెలిచింది.

భారత నంబర్‌వన్‌ మనిక బత్రా తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు భారత పురుషుల జట్టు గ్రూప్‌–3లో భాగంగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–3తో ఓడిపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement