న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన | England Has Named Their Playing XI For Third Test Against New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Dec 13 2024 5:23 PM | Updated on Dec 13 2024 5:29 PM

England Has Named Their Playing XI For Third Test Against New Zealand

హ్యామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్‌ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన క్రిస్‌ వోక్స్‌ స్థానంలో మాథ్యూ పాట్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్‌ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలుపొందింది. మరో టెస్ట్‌ మిగిలుండగానే ఇంగ్లండ్‌ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్ట్‌ సిరీస్‌ విజయం.

తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో విజయం
క్రైస్ట్‌చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరఫున హ్యారీ బ్రూక్‌ (171), బ్రైడన్‌ కార్స్‌ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.

323 పరుగుల తేడాతో విజయం
వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరఫున హ్యారీ బ్రూక్‌ (123, 55), జో రూట్‌ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.

మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement