మరోసారి తండ్రైన జోస్‌ బట్లర్‌ | Jos Buttler And His Wife Have Blessed With A Baby Boy | Sakshi
Sakshi News home page

మరోసారి తండ్రైన జోస్‌ బట్లర్‌

Published Fri, Jun 14 2024 7:07 PM | Last Updated on Fri, Jun 14 2024 7:16 PM

England Captain Jos Buttler And His Wife Blessed With A Baby Boy

ఇంగ్లండ్‌ పరిమిత​ ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మూడోసారి తండ్రి అయ్యాడు. బట్లర్‌ భార్య లూయిస్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బట్లర్‌-లూయిస్‌ దంపతులకు ఇదివరకే పాప, బాబు ఉన్నారు. బట్లర్‌ దంపతులు తమ మూడో సంతానానికి చార్లీ అని పేరు పెట్టారు. చార్లీ పుట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిన్నారి గత నెల (మే) 28వ తేదీనే జన్మించినట్లు తెలుస్తుంది. చార్లీ జన్మించిన విషయాన్ని బట్లర్‌ దంపతుల గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జోస్‌ బట్లర్‌ టీ20 ప్రపంచకప్‌ 2024తో బిజీగా ఉన్నాడు. బట్లర్‌ సారథ్యం వహిస్తున్న ఇంగ్లండ్‌ జట్టు గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8 బెర్త్‌ కోసం స్కాట్లాండ్‌తో పోటీపడుతుంది. గ్రూప్‌ దశలో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం స్కాట్లాండ్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో గ్రూప్‌-బిలో రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ మూడింట ఒక మ్యాచ్‌ గెలిచి 3 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. 

స్కాట్లాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దు రావడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ పంచుకున్నాయి. ఇంగ్లండ్‌ సూపర్‌-8కు చేరాలంటే తదుపరి నమీబియాతో ఆడబోయే మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. అలాగే స్కాట్లాండ్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ నమీబియాపై గెలిచి, స్కాట్లాండ్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ రద్దైనా ఇంగ్లండ్‌ ఇంటి ముఖం​ పట్టాల్సి ఉంటుంది. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకుంది.

మరోవైపు గ్రూప్‌-ఏ నుంచి భారత్‌.. గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్‌-8కు అర్హత సాధించాయి. గ్రూప్‌-బి నుంచి నమీబియా, ఒమన్‌.. గ్రూప్‌-సి నుంచి ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-డి నుంచి శ్రీలంక ఎలిమినేట్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement