ENG vs PAK: పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు ఎంట్రీ

England announce playing XI for first Test against Pakistan - Sakshi

రావల్పిండి వేదికగా గురువారం పాకిస్తాన్‌తో తొలి టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్‌ సిద్దమైంది. 17 ఏళ్ల తర్వాత తొలి సారి పాక్‌ గడ్డపై ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. అయితే తొలి టెస్టులో పాల్గోనే తమ తుది జట్టును ఇంగ్లండ్‌ ప్రకటించింది. ఇక విధ్వంసకర ఆల్‌రౌండర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్‌ తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు.

పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టులో చోటు దక్కింది. అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. మరోవైపు గత కొన్నేళ్లగా ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు దూరంగా ఉన్న బెన్ డకెట్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు  జాక్ క్రాలీతో కలిసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇక పాక్‌ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.
 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top