
మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తొలి టీ20 తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మతో కలిసి జైశ్వాల్ ప్రారంభిస్తాడని హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్‌కు ఎందుకు చోటు దక్కలేదని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
కారణమిదే..
అయితే గాయం కారణంగా ఆఖరి నిమిషంలో జైశ్వాల్ దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది. కుడి గజ్జలో నొప్పితో బాధపడుతున్నాడని, ఆడే పరిస్థితుల్లో లేడని బీసీసీఐ ఎక్స్ వేదికగా తెలిపింది. భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నారు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కలేదు. అతడి స్ధానంలో జితేష్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్