Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం.. ఆర్మీ స్టేడియానికి అతని పేరు

Defence Minister Rajnath Singh Renames Army Sports Institute Stadium In Pune After Neeraj Chopra - Sakshi

పుణే: అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్‌ స్వర్ణాన్ని అందించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ (ఏఎస్‌ఐ)కు నీరజ్‌ పేరు పెట్టారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న డిఫెన్స్‌ రంగానికి చెందిన క్రీడాకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ శుక్రవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన నీరజ్‌ చోప్రాతో పాటు తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ (ఆర్చరీ), అమిత్‌, మనీష్‌ కౌషిక్‌, సతీష్‌ కుమార్‌ (బాక్సింగ్‌), వారి కోచ్‌లను సన్మానించారు. చోప్రాకు జావెలిన్‌ను బహుకరించిన కేంద్ర మంత్రి.. ఏఎస్‌ఐ పేరును నీరజ్‌ చోప్రా స్టేడియంగా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఒలింపిక్స్‌ నిర్వహించే అవకాశం భారత్‌కు రావాలనేది తన ఆకాంక్ష అని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అన్నారు.
చదవండి: Tokyo Paralympics:టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్స్‌కు భవీనాబెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top