
photo courtesy: IPL
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా వార్నర్ అంత మంచోడేమీ కాదని, అతనికి పార్టీలెక్కువ, ప్రాక్టీస్ తక్కువ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. వార్నర్ డ్రెస్సింగ్ రూమ్‌లో తరచూ గొడవలు పడుతుండేవాడని, అతను క్రమశిక్షణతో మెలిగేవాడే కాదని సంచలన ఆరోపణలు చేశాడు.
2009లో తాను ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో వార్నర్ తన జట్టులో కీలక సభ్యుడిగా ఉండేవాడని, అయినప్పటికీ అతను తరుచే వివాదాల్లో తలదూర్చేవాడని, అందువల్లే అతన్ని కొన్ని సందర్భాల్లో పక్కకు పెట్టామని గుర్తు చేసుకున్నాడు. జట్టులో చేరిన కొత్తలో వార్నర్ ప్రాక్టీస్ మానేసి పార్టీల్లో మునిగి తేలేవాడని, ఆ సమయంలో అతన్ని కంట్రోల్ చేయడం తమకు చాలా కష్టమయ్యేదని పేర్కొన్నాడు.
కాగా, డేవిడ్ వార్నర్ 2009లో ఢిల్లీ సభ్యుడిగా తన ఐపీఎల్ జర్నీని ప్రారంభించాడు. ఆతర్వాత అతను సన్‌రైజర్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి, ఆ జట్టుకు 2016లో టైటిల్ అందించాడు. అయితే, సన్‌రైజర్స్ గతేడాది అతనిపై వేటు వేయడంతో తిరిగి ఢిల్లీ గూటికి చేరాడు. 2022 ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్‌లో వార్నర్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించి, టోర్నీలో నాలుగో అత్యధిక రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: IPL 2022: అమ్మకు వందనం.. మదర్స్ డే సందర్భంగా సన్ రైజర్స్ స్పెషల్ వీడియో