Ben Vs Hyd: 5 వికెట్లతో చెలరేగిన పృథ్వీ రెడ్డి.. | Cooch Behar Trophy: Bengal Vs Hyderabad Pacer Prithvi Reddy 5 Wickets | Sakshi
Sakshi News home page

Ben Vs Hyd: 5 వికెట్లతో చెలరేగిన పృథ్వీ రెడ్డి

Dec 21 2021 7:23 AM | Updated on Dec 21 2021 7:55 AM

Cooch Behar Trophy: Bengal Vs Hyderabad Pacer Prithvi Reddy 5 Wickets - Sakshi

వారెవ్వా పృథ్వీ రెడ్డి.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి

Cooch Behar Trophy: బెంగాల్‌తో జరుగుతున్న కూచ్‌బెహర్‌ ట్రోఫీ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ పృథ్వీ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. పృథ్వీ (5/54) ధాటికి మ్యాచ్‌ తొలి రోజు సోమవారం బెంగాల్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ అభిషేక్‌ పొరేల్‌ (145 బంతుల్లో 104; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించగా... మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.

బెంగాల్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ తౌఫీకుద్దీన్, అభిషేక్‌ పొరేల్, ఇర్ఫాన్‌ ఆఫ్తాబ్, సిద్ధార్థ్‌ సింగ్, శశాంక్‌ సింగ్‌లను పృథ్వీ రెడ్డి అవుట్‌ చేశాడు. ఓవరాల్‌గా పృథ్వీ రెడ్డి 14 ఓవర్లు వేయగా అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. ఇతర హైదరాబాద్‌ బౌలర్లలో శశాంక్, అభిషేక్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.  

చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్‌, బట్లర్‌ పాపం..
ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement