భారత్‌కు రెండో గెలుపు  | Billie Jean King cup 2022: India Beat New Zeland 2-1 | Sakshi
Sakshi News home page

Billie Jean King cup 2022: భారత్‌కు రెండో గెలుపు 

Apr 16 2022 11:52 AM | Updated on Apr 16 2022 11:52 AM

Billie Jean King cup 2022: India Beat New Zeland 2-1 - Sakshi

అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు ఖాతాలో రెండో గెలుపు చేరింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో రుతుజా బోస్లే 6–1, 7–6 (7/3)తో వలెంటీనా ఇవనోవ్‌పై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.

రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ అంకిత రైనా 7–5, 6–3తో పైజ్‌ హురీగాన్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించింది. డబుల్స్‌లో సౌజన్య బవిశెట్టి–రియా భాటియా జంట ఓడిపోయింది. గురువారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement