ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2026లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ జీ యీ చేతిలో 11-21, 21-15, 17-21తో సింధు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో వాంగ్ జీ యీ తీవ్ర గాయంతో బాధపడుతున్నప్పటికీ అద్భుత ప్రదర్శన కనబరిచింది.
తొలి గేమ్‌ను 11-21తో సింధు కోల్పోయింది. కానీ రెండో గేమ్‌లో తిరిగి పుంజుకున్న సింధు.. 21-15తో గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. అయితే మూడో గేమ్‌ను 21-17తో కైవసం చేసుకోవడంతో సింధు కథ ముగిసింది. మరోవైపు ఆయుష్ శెట్టి కూడా పురుషుల సింగిల్స్ రౌండ్-16 మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్ అల్వీ ఫర్హాన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.


