అలా జరిగితే కోహ్లి రిటైర్మెంట్ వెనక్కి: మైఖేల్ క్లార్క్ | Australian Great Michael Clarke Makes Huge Claim On Virat Kohlis Test Retirement | Sakshi
Sakshi News home page

అలా జరిగితే కోహ్లి రిటైర్మెంట్ వెనక్కి: మైఖేల్ క్లార్క్

Jun 7 2025 3:16 PM | Updated on Jun 7 2025 3:37 PM

Australian Great Michael Clarke Makes Huge Claim On Virat Kohlis Test Retirement

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు విరాట్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డిండాడు. అత‌డితో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా రెడ్‌బాల్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.

అత‌డి స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక‌య్యాడు. కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి ఇద్ద‌రూ దిగ్గ‌జాల లేకుండానే భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైంది. కేఎల్ రాహుల్‌, జ‌డేజా, బుమ్రా మిన‌హా పెద్ద‌గా అనుభ‌వం ఉన్న ఆట‌గాళ్లు ప్ర‌స్తుత భార‌త టెస్టు జ‌ట్టులో లేరు. దీంతో ఇంగ్లండ్‌పై గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఎలా రాణిస్తుందో అని అంద‌రూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగే ఐదు టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోతే విరాట్ తిరిగి త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకుంటాడ‌ని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

"ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టు 5-0 తేడాతో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొటే, కచ్చితంగా విరాట్ కోహ్లి తిరిగి రావాలని అంతా కోరుకుంటారు. ఆ సమయంలో కెప్టెన్‌, అభిమానులు, సెలక్టర్లు అభ్యర్దిస్తే కోహ్లి కచ్చితంగా తన మనసును మార్చుకుంటాడని అనుకుంటున్నాను. 

ఎందుకంటే అతడు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌ను ప్రేమిస్తున్నాడు. ఆ ఫార్మాట్‌పై అతనికి ఎంత మక్కువ ఉందో అందరికీ తెలుసు. విరాట్ ఇప్పటికీ మెరుగైన క్రికెట్ ఆడుతున్నాడు. అయితే విరాట్ రిటైర్మెంట్ గల కారణాలంటో మనకు తెలియదు. కానీ ప్రతీ ఒక్కరూ తమ కెరీర్‌ను ఏదో ఒక చోట ముగించికతప్పదు" అని బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి, 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. 
చదవండి: రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?
 

Advertisement
 
Advertisement
Advertisement