అద్భుత క్యాచ్‌.. రోహిత్‌ను హత్తుకున్న కోహ్లి.. సెలబ్రేషన్‌ మామూలుగా లేదు! | Asia Cup 2023, Ind vs SL: Kohli Hugs Rohit After Stunning Catch Goes Viral | Sakshi
Sakshi News home page

Rohit- Kohli: రోహిత్‌ను హత్తుకున్న కోహ్లి.. సెలబ్రేషన్‌ మామూలుగా లేదు! వైరల్‌

Sep 13 2023 11:15 AM | Updated on Sep 13 2023 12:03 PM

Asia Cup 2023 Ind vs SL: Kohli Hugs Rohit Stunning Catch Goes Viral - Sakshi

రోహిత్‌ను హత్తుకున్న కోహ్లి (PC: Twitter/star sports)

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో క్రికెట్‌ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు చిరాకు తెప్పించిన వాళ్లకు అదే రీతిలో కౌంటర్‌ వేసే రన్‌మెషీన్‌.. క్లిష్ట సమయాల్లో జట్టుకు అనుకున్న ఫలితం వస్తే మాత్రం చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. 

సహచర ఆటగాళ్లను అభినందిస్తూ సెలబ్రేషన్స్‌ చేసుకుంటాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి మరోసారి ఇదే రిపీట్‌ చేశాడు. లంక కెప్టెన్‌ దసున్‌ షనక ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టిన టీమిండియా సారథి రోహిత్‌ శర్మను ఆలింగనం చేసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

కొలంబో వేదికగా భారత్‌- శ్రీలంక మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ సేన 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై లో స్కోరింగ్‌కే పరిమితమైంది.

ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక.. ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు నిసాంక(6), దిముత్‌ కరుణ రత్నె(2)... వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌(15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన సమరవిక్రమ 17, చరిత్‌ అసలంక 22 పరుగులు చేశారు.

ఈ క్రమంలో ధనుంజయ డి సిల్వ 41 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ దసున్‌ షనక నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. 26వ ఓవర్‌ మొదటి బంతికే రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. అవుట్‌సైడ్‌ ఆఫ్‌ దిశగా.. జడ్డూ సంధించిన బంతిని షాట్‌ ఆడేందుకు యత్నించి విఫలమయ్యాడు.

అయితే, స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ తన కుడివైపునకు అద్బుతంగా డైవ్‌ చేసి షనక ఇచ్చిన లో క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. దీంతో టీమిండియా శిబరంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ క్రమంలో రోహిత్‌ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లిన కోహ్లి.. అతడిని ఆత్మీయంగా హత్తుకున్న తీరు ముచ్చటగొలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగులతో గెలిచిన టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 53 పరుగులతో రాణించగా.. కోహ్లి 3 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. వీళ్లిద్దరినీ.. వీరితో పాటు శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాలను లంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే అవుట్‌ చేయడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement