వరల్డ్‌ నంబర్‌ వన్‌ సబలెంకా శుభారంభం 

Aryna Sabalenka Sizzles Past Maria Sakkari As WTA Finals Begin - Sakshi

మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌) శుభారంభం చేసింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి లీగ్‌ మ్యాచ్‌లో సబలెంకా 6–0, 6–1తో మరియా సాకరి (గ్రీస్‌)పై గెలిచింది.

74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. మరో లీగ్‌ మ్యాచ్‌లో జెస్సికా పెగూలా (అమెరికా) 7–5, 6–2తో రిబాకినా (కజకిస్తాన్‌)పై విజయం సాధించింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top