ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వైదొలిగిన అనిల్‌ ఖన్నా | Anil Khanna Quits IOA Acting President Takes Dig At IOC | Sakshi
Sakshi News home page

Indian Olympic Association: ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వైదొలిగిన అనిల్‌ ఖన్నా

Sep 22 2022 9:12 AM | Updated on Sep 22 2022 9:15 AM

Anil Khanna Quits IOA Acting President Takes Dig At IOC - Sakshi

స్పోర్ట్స్‌ సీనియర్‌ అథారిటీ అనిల్‌ ఖన్నా బుధవారం ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. తాత్కాల్కిక అధ్యక్షునిగా అనిల్‌ ఖన్నాను గుర్తించలేమని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) గతంలో స్పష్టం చేసింది. ఈ మేరకే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఇక డిసెంబర్‌ కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకపోతే భారత్‌ నిషేధిస్తామని ఐఓసీ ఈ నెల 8న హెచ్చరించింది.

అనిల్‌ ఖన్నా మాట్లాడుతూ.. ''ఐవోసీ ఒప్పుకోకపోవడంతో తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నా. ప్రస్తుతం ఐఓఏ క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఐఓఏ కార్యకలాపాలను సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృష్టి చేస్తోంది. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారని ఆశిస్తున్నా'' అంటూ తెలిపాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement