IND Vs SA: "అందుకే దక్షిణాఫ్రికా టూర్‌కు రహానేను ఎంపిక చేశారు"

Ajinkya Rahane performs well in overseas conditions Says MSK Prasad - Sakshi

Ajinkya Rahane:  దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌ టెస్ట్‌ జట్టును బీసీసీఐ బుధవారం( డిసెంబర్‌ 8) ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని అజింక్య రహానే పై వేటు తప్పదని అంతా భావించనప్పటికీ.. అనుహ్యంగా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే రహానెను వైస్‌ కెప్టెన్‌ భాధ్యతల నుంచి తప్పించి రోహిత్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో సెలక్టర్లు రహానెను ఎందుకు ఎంపిక చేశారో భారత  మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్‌స్కే ప్రసాద్‌ తెలిపాడు. విదేశీ పిచ్‌ల్లో రహానెకు  వున్న రికార్డుల వల్ల అతడివైపు  సెలక్టర్లు మొగ్గు చూపారని ఎమ్‌స్కే ప్రసాద్‌ చెప్పాడు. 

"జట్టు ఎప్పుడూ జూనియర్లు, సీనియర్లు కలయిక తో సమతూకంగా ఉండాలి. రహానే విషయానికి వస్తే..2013లో టెస్ట్‌ క్రికెట్‌లో అద్బుతంగా రాణించాడు. సాధరణంగా రహానే విదేశాల్లో బాగా రాణిస్తాడు. కానీ స్వదేశంలో అతడికి పెద్దగా రికార్డులు లేవు. గత కొద్దికాలంగా అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. ఈ క్రమంలో సెలెక్టర్లకు అతడిని ఎంపిక చేసే ముందు కాస్త అయోమయంకు గురై ఉంటారు. అయితే విదేశాల్లో అతడికి ఉన్న ట్రాక్‌ రికార్డును చూసి సెలెక్టర్లు ఎంపిక చేసుండవచ్చు" అని  ఎమ్‌స్కే ప్రసాద్‌ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా విదేశాల్లో రహానే 40 సగటుతో 3000పైగా పరుగులు సాధించాడు. ఇక సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌-26న  భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. 

భారత టెస్ట్‌ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా

చదవండి: IND-A Vs SA-A: భారత్‌- దక్షిణాఫ్రికా సిరీస్‌ డ్రా..

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top