
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 128 పరుగుల లక్ష్య చేధనలో పాక్ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆటగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.
అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేశాడు. ఈ యువ సంచలనం తన ఇన్నింగ్స్‌ను 238.46 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అభిషేక్.. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
పాకిస్తాన్‌పై టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులెక్కాడు. యువరాజ్ సింగ్ 2012లో పాక్‌పై 200.00 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు.
తాజా మ్యాచ్‌లో 238.46 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అభిషేక్.. యువీని అధిగమించాడు. కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. ఇప్పుడు అభిషేక్ టీ20ల్లో ఏకంగా వరల్డ్ నెం1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా