ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శనివారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 39 బంతుల్లోనే 69 పరుగులు చేసి పంజాబ్ విజయంలో సింగ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఈ ఏడాది సీజన్‌లో 500 పరుగుల మార్కును దాటాడు. తద్వారా ప్రభ్‌సిమ్రాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో రెండు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా ఈ పంజాబ్ క్రికెటర్ నిలిచాడు. ప్రభ్‌సిమ్రాన్ ఐపీఎల్-2025 సీజన్‌లోనూ 500 పరుగులు దాటాడు. అతడి కంటే ముందు ఏ ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కూడా ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు ఇంకో రెండు ఓవర్లు మిగిలూండగానే ఊదిపడేశారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించాడు. కేవలం 51 బంతుల్లోనే 101 పరుగులతో తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.


