
చైన్నై సినిమా: 'కాక్కా ముట్టై', 'ఆండవన్ కట్టలై' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శక నిర్మాత మణికంఠన్. ఈయన నిర్మాతగా మారి కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం వహిస్తూ రూపొందిన చిత్రం 'కడైసీ వ్యవసాయి'. నల్లాండి అనే 86 ఏళ్ల వృద్ధుడు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, యోగిబాబు కీలకపాత్ర పోషించారు.
'కడైసీ వ్యవసాయి' చిత్రానికి సంతోష్ నారాయణన్, రిచర్డ్ హార్వీ సంగీతం అందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11 తేదిన విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. కాగా మణికంఠన్ విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతులు, గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రం ఇదని పేర్కొన్నారు.