విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

సిద్దిపేటరూరల్‌: ప్రతీ విద్యార్థి తనలోని నైపుణ్యాలను గ్రహించి విద్య, ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థులకు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి పథకాలపైన కలెక్టర్‌ అధ్యక్షతన ఒక రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాలలో యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, వారిలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి యువత కోసం అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చిందన్నారు. అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లలో చేరడం ద్వారా తక్కువ సమయంలో మంచి ఉపాధి పొందవచ్చని, ఇంజనీరింగ్‌ వాళ్లకు లేనన్ని ఉపాధి అవకాశాలు ఈ అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లలోను విద్యార్థులకు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కలెక్టర్‌ హైమావతి

ఉపాధి, విద్య అవకాశాలపై శిక్షణ

Advertisement
 
Advertisement
Advertisement