
సంఘటితంగా ఉద్యమిద్దాం
● 18న బంద్ జయప్రదం చేద్దాం
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
సిద్దిపేటజోన్: ‘రిజర్వేషన్ల సాధనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలన్నీ ఏకమై సంఘటితంగా ఉద్యమిద్దాం. 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దాం’ అని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులోని ఓ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈనెల 18న నిర్వహించనున్న బంద్ విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టగా కోర్టు కేసులతో ఆశలపై సందిగ్ధం నెలకొందన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన చివరి దశలో ఉందని, వత్తిడి తెచ్చి సాధించుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు చంద్రం, సర్పంచ్ ఫోరం రాష్ట్ర జేఏసీ సెక్రటరీ సుభాష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్, జిల్లా సీపీఐ సెక్రటరీ పవన్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నవీన్ గౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు శ్రీహరి, శ్రీనివాస్,రాజేశం, వెంకట్, ఎల్లయ్య, శ్రీనివాస్,నరేందర్ పాల్గొన్నారు.