
రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం
మాట్లాడుతున్న ఐక్యకార్యాచరణ కమిటీ నేతలు
దుబ్బాక: పార్టీలు, రాజకీయలను పక్కన పెట్టి 42 శాతం రిజర్వేషన్లే లక్ష్యంగా పోరాటం చేయాలని బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం దుబ్బాకలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని కుల సంఘాలతో బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు మచ్చ శ్రీనివాస్, పల్లె వంశీకృష్ణాగౌడ్, శ్రీరాం నరేందర్ ఉన్నారు.
బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ