
1,250 మద్యం దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు 1,250 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు శుక్రవారం 688 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు మొత్తం 1,250 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సర్కిల్ వారీగా సిద్దిపేట 380, గజ్వేల్ 318, హుస్నాబాద్ 295, చేర్యాల 177, మిరుదొడ్డి 80 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుకు శనివారం చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు.
ఎర్రోళ్లను
పరామర్శించిన కేటీఆర్
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం గంగాపూర్‌లోని ఆయన నివాసంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను
సద్వినియోగం చేసుకోండి
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ మొక్కజోన్న విత్తనాలను అందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా, నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందిస్తోందని చెప్పారు. రైతులు విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకొంటే పంటల దిగుబడులు పెరుగుతాయన్నారు. విచ్చల విడిగా రసాయన ఎరువులను వేసి పెట్టుబడుల భారం పెంచుకోవద్దన్నారు.
స్కావెంజర్ల పెండింగ్
వేతనాలు చెల్లించండి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులను పరిశుభ్రంగా ఉంచేందుకు స్కావెంజర్లను నియమించారన్నారు. రెండేళ్లలో 9 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ధర్నాలో సహాయ కార్యదర్శి రవికుమార్, రాములు, కవిత, రజిత పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాలు
ఏర్పాటు చేయండి
సిద్దిపేటరూరల్: జిల్లావ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ పత్తి పంట చేతికి అందే దశలో గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 10,075కు పెంచి కొనుగోళ్ళు చేపట్టాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందించారు.

1,250 మద్యం దరఖాస్తులు

1,250 మద్యం దరఖాస్తులు