
మంచి సంస్కృతి కాదు
సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను సాకుగా చూపి ఏపీ పోలీసులు సాక్షి ఎడిటర్ దనంజయ రెడ్డి, పాత్రికేయుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం మంచి సంస్కృతి కాదు. కథనాల మీద అభ్యంతరం, ఆక్షేపణలు ఉంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి. సాక్షి ఎడిటర్ పైన అక్రమ కేసులు నమోదు చేయడం దారుణం.
– వేణుగోపాల్ రెడ్డి,
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు
ఇబ్బందులకు గురిచేయొద్దు
నకిలీ మద్యం అంశంపై కథనాలు రాసిన సాక్షిపై తప్పుడు కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతమే. విచారణ పేరిట సాక్షి కార్యాలయంలో పోలీసుల హడావిడి సరికాదు. కథనాలపై ఆక్షేపణ ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి. కానీ పత్రిక కార్యాలయంలో సోదాల పేరిట ఇబ్బందులకు గురిచేయద్దు. – అంజయ్య,
ప్రెస్ అకాడమీ మాజీ సభ్యుడు

మంచి సంస్కృతి కాదు