
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
‘సాక్షి’పై దాడులు సరికావు
● టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు రంగాచారి
● నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన
సిద్దిపేటకమాన్/సిద్దిపేటజోన్: పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని, సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్‌పై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు, విచారణ పేరుతో నిర్బంధకాండకు వ్యతిరేకంగా సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టులపై దాడులను మానుకోవాలన్నారు. ప్రత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పత్రికా కార్యాలయాల మీద దాడులు ఆపాలన్నారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు రాజిరెడ్డి, నాగరాజు, రంగధాంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, యాదగిరిగౌడ్, జనార్ధన్, శ్రీనివాస్, మైసారెడ్డి, రవి, నరేష్, సాయి, ఇంద్ర, సంతోష్, మల్లారెడ్డి, రాజబాబు, అరుణ్, శ్రీకాంత్, శ్రీనాథ్, చందు, రాజు, వంశీ, స్వామిగౌడ్, ముంజ గిరి, వెంకట్, నరేష్, కృష్ణ, వెంకట్, గణేష్, గణేష్‌బాబు, పరశురాములు, దయానంద్, రజనీకాంత్, దర్శన్, దయానంద్, రాజు, సతీష్, ఇంద్రసేనారెడ్డి, సంతోష్, శ్రీకాంత్, వెంకటేష్, కుమారస్వామి, తులసి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు సరికాదు
కథనాలను ఆధారంగా చూపుతూ సాక్షి పత్రిక ఎడిటర్‌పై ఏపీ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. అభ్యంతరం ఉంటే చట్టపరమైన, సామరస్యంగా దారులలో వెళ్లాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిదీ.
– తిరుపతి రెడ్డి,
ఏపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
కేసులు ఉపసంహరించాలి
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికలపై వత్తిడి సరికాదు. ఎడిటర్‌ను లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేసినట్టుగా ఉంది. ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరించేలా చర్యలు ఉండొద్దు
– తిరుమల్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు

పత్రికా స్వేచ్ఛను హరించడమే..

పత్రికా స్వేచ్ఛను హరించడమే..

పత్రికా స్వేచ్ఛను హరించడమే..