
ఎడ్యుకేషన్ హబ్‌లో ఎంఈఓ విచారణ
గజ్వేల్: ‘మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. శుక్రవారం స్థానిక బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని హైస్కూల్‌కు ఎంఈఓ వై.కృష్ణ వెళ్లి విచారణ జరిపారు. విద్యార్థులకు గొడ్డు కారం పెట్టిన విషయం నిజమేనని ఎంఈఓ నిర్ధారించారు. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో హెచ్‌ఎంలతోపాటు ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. మెనూ అమలులోనూ నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు. విచారణ అంశాలను జిల్లా విద్యాధికారికి నివేదించనున్నట్లు ఎంఈఓ ‘సాక్షి’కి తెలిపారు. డీఈఓ ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో ఎంఈఓ విచారణ