నేతల పోకడ ఇలా..
● ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నంగునూరు మండల అధికార పార్టీ నాయకుడు సంబంధిత హౌసింగ్ ఏఈకి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా ఎంపీడీఓ, కలెక్టర్‌ను సైతం దూషించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. సదరు నేతపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకొన్నట్లు తెలిసింది. దూషించినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది.
● నంగునూరు మండల పరిధిలో తాము చెప్పిన పనులు చేయాలని ఓ అధికార పార్టీ నేత పరిషత్ కార్యాలయ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గత 29న కలెక్టర్‌ను సదరు అధికారి కలిసి తాము ఇక్కడ పని చేయలేమని మొరపెట్టుకున్నారు. కలెక్టర్ మందలించినా నేతల్లో మాత్రం మార్పురాకపోవడం గమనార్హం. నంగునూరు మండలంలో పని చేయడం ఇబ్బందిగా ఉందని ఎంపీడీఓ, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది తన దృష్టికి తీసుకవచ్చారని ఈ నెల 8న విలేకర్లతో చిట్ చాట్‌లో స్వయంగా సీపీ విజయ్ కుమార్ వెల్లడించిన విషయం విదితమే.
● నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌసొద్దిన్‌కు చెందిన బైక్‌ను ఆగస్టు 2న గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామ పంచాయతీ విధుల్లో భాగంగా వైకుంఠధామం వద్ద బైక్‌ను పార్క్ చేసి, గ్రామ నర్సరీని పరిశీలించేందుకు గౌసొద్దిన్ వెళ్లారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై పెట్రోల్ పోసి దహనం చేశారు. దీంతో రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకా ఎవరన్నది తేలలేదని సమాచారం.
● చెప్పినట్లు వినకపోతే బెదిరింపులు ● వీరిని బదిలీ చేయాల