ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి

Oct 17 2025 8:26 AM | Updated on Oct 17 2025 8:26 AM

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి మనోధైర్యమే సమస్యలకు పరిష్కారం పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకం స్కూళ్ల తనిఖీలకు టీచర్లను వేయొద్దు

సీపీ విజయ్‌కుమార్‌

గజ్వేల్‌రూరల్‌: పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని, బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ విధులు నిర్వహించే సిబ్బంది ఎళ్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నరసింహులు, సీఐ రవికుమార్‌, ట్రాఫిక్‌ సీఐ మురళి, రూరల్‌ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గజ్వేల్‌: మనోధైర్యంతో ముందుకుసాగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రముఖ మానసిక వికాస నిపుణుడు వీరేందర్‌ అన్నారు. వర్గల్‌ మండలం వేలూరు గ్రామంలో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత పులి రాజు రచించిన ‘వేలూరు ఆత్మహత్యల గోస’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన వీరేందర్‌ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోయే మనస్తత్వానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. కార్గిల్‌ యుద్ధ వ్యహకర్త కల్నల్‌ జీజే రావు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల నివారణకు తనవంతుగా సెప్టెంబర్‌ 10 సినిమా తీశానని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. సమస్యలు ఎదురైనపుడు దాచుకోకుండా, బంధువులకు, సన్నిహితులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పెద్ది రాజు, టీపీటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటఎడ్యుకేషన్‌: పర్యావరణాన్ని పరిరక్షించడంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత అన్నారు. గురువారం స్థానిక కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎకో బజార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో విద్యార్థులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణహిత స్టాల్స్‌ ను పరిశీలించి అభినందించారు. అనంతరం విద్యార్థులకు పోస్టర్‌ ప్రజెంటేషన్‌, క్విజ్‌, వ్యాసరచన తదితర పోటీల నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతుల అందించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అయోధ్య రెడ్డి ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మధుసూదన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌

అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

చిన్నకోడూరు(సిద్దిపేట): పాఠశాలల తనిఖీలకు ఉపాధ్యాయులను వేయొద్దని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం చిన్నకోడూరు, అల్లీపూర్‌, పెద్దకోడూరు, మాచాపూర్‌, గంగాపూర్‌ ఉన్నత పాఠశాలల్లో సమస్యల సేకరణ, పభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ అమలు చేసి, ఖాళీగా ఉన్న ఎంఈఓ, జిల్లా ఉప విద్యాధికారుల పోస్టులు భర్తీ చేసి వారి ద్వారా పాఠశాలల పర్యవేక్షణ చేయాలన్నారు. పీఆర్‌సీ వెంటనే అమలు చేసి, ఐదు డీఏలు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మహేందర్‌ గౌడ్‌, కార్యదర్శి దేవ ఋషి, జిల్లా నాయకులు జానికి రాములు, శివాజీ, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement