నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం | - | Sakshi
Sakshi News home page

నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం

Aug 3 2025 8:52 AM | Updated on Aug 3 2025 9:00 AM

నిజమై

నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం

స్నేహానికి కన్న మిన్న.. లోకాన లేదురా.. అనేది ఒకప్పటి సినిమా పాట. ఇది నిజమేనంటున్నారు ఇప్పటి యువత, విద్యార్థులు, ఉద్యోగులు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ బృందం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. మొత్తం వంద మందితో ఈ సర్వే చేసింది. యువత, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారు, వృత్తి నిపుణులు.. వివిధ వర్గాలకు చెందిన వారి ఒపీనియన్‌లను సేకరించింది. తమ అభిప్రాయలు వెలుబుచ్చిన వారిలో సగం మంది మహిళలు ఉన్నారు. ఈ సర్వే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కల్మషం లేనిదే నిజమైన స్నేహమని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, నిజమైన స్నేహంలో స్వార్థానికి తావులేద ని చెప్పారు. అవసరాలు తీర్చేదే స్నేహమని తక్కువ మంది తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

స్నేహం కలుషితమవుతోంది..

ప్రస్తుత రోజుల్లో ఫ్రెండ్‌ షిప్‌ కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వంద మందిలో 57 మంది ఇదే అబిప్రాయాన్ని చెప్పారు. ఎలాంటి కలుషిత కాలేదని 47 శాతం మంది చెప్పారు. ప్రస్తుత రోజుల్లో స్నేహితులు ఎంతో మంది ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు పరిమితంగానే ఉంటారు. మీకు నిజమైన స్నేహితులు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఇద్దరి కంటే ఎక్కువ మంది నిజమైన స్నేహితులు ఉన్నారని చెప్పిన వారే అధికంగా ఉన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది స్నేహితులున్నారని 61 మంది చెప్పగా, ఒక్కరే నిజమైన స్నేహితుడు ఉన్నాడని 39 మంది అన్నారు.

మొదటగా కన్నవారే..

కన్న వారి తర్వాతే మిత్రుడికి స్థానమని ఎక్కువ మంది చెప్పారు. 67 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలిపారు. 27 శాతం మంది ఫ్రెండ్‌ తర్వాతే అమ్మానాన్న అని చెప్పిన వారు కూడా ఉన్నారు. నాన్న, అమ్మ, ఫ్రెండ్‌ అని చెప్పిన వారు 16 మంది ఉన్నారు.

– సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి,

సంగారెడ్డి జోన్‌/మెదక్‌ జోన్‌/సిద్దిపేట

3) మీకు ఎంతమంది

నిజమైన ఫ్రెండ్స్‌ ఉన్నారు?

4) మీ ఫ్రెండ్‌కు మీరు ఇచ్చే స్థానం?

2) ఫ్రెండ్‌షిప్‌ కూడా కలుషితం అయ్యిందా?

నాన్న, అమ్మ,

ఫ్రెండ్‌

అమ్మ,

నాన్న, ఫ్రెండ్‌

అని

చెప్పిన

వారు

ఒకరు

లేదు

39

43

57

అవును

61

ఫ్రెండ్‌,

అమ్మ,

నాన్న

ఇద్దరికి

మించి

ఉమ్మడి జిల్లాలో సర్వే వివరాలు..

1) ఫ్రెండ్‌ షిప్‌ అంటే మీ దృష్టిలో..

74

26

కన్నవారి తర్వాతే మిత్రుడు..

ప్రస్తుత స్నేహ బంధాలు

కలుషితం అవుతున్నాయి

ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా సాక్షి సర్వే

ఆసక్తి కరమైన అంశాలు వెలుగులోకి..

అవసరాలు

తీర్చేది

అని..

కల్మషం

లేనిది

అని

చెప్పిన

వారు

నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం1
1/2

నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం

నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం2
2/2

నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement