
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేటజోన్: యోగాతో మానసిక ఒత్తిడిని దూరం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో అస్మితా యోగాసనా సిటీ లీగ్ – 2025 మహిళల యోగా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తెచ్చిందని, కరోనా తర్వాత యోగా ప్రాముఖ్యత పెరిగిపోయిందన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఆస్పత్రుల్లో నయం చేసుకునే కంటే ముందుగానే స్వీయ రక్షణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా, వాకింగ్ లాంటి తప్పనిసరి చేయాలన్నారు. యువతులు, బాలికలు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, వైస్ చైర్మన్ కనకరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్‌రెడ్డి, సాయిరాం, డాక్టర్ అరవింద్, నిర్వాహకులు సతీశ్, సంధ్య, అంజయ్య, అశోక్ శ్రీనివాస్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, విజయ పాల్గొన్నారు.