సంగారెడ్డి టౌన్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మనకోసం నిలబడే వాళ్లే నిజమైన స్నేహితులు. కష్టాలు, బాధలు, సంతోషాలను పంచుకుంటూ అందరితో కలిసిపోతూ ఉండాలి. నా చిన్న నాటి నుంచి ముగ్గురు స్నేహితులం. వారు వృత్తిరీత్యా ఇతర దేశాలో స్థిర పడినప్పటికీ సమయం దొరికినప్పుడు కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ అందరితో కలిసి ఉండాలి. ‘నేను ఉన్నాను’ అనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ విజ్ఞాన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.
– సౌజన్య,
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
ఆనాటి స్మృతులు
మధురం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్నేహితులతో కలిసి మట్టిలో ఆడిన ఆటలు.. చెట్టు కొమ్మల్లో దాగిన రోజులు నేటికీ గుర్తుకువస్తే ఎంతో సంతోషంగా ఉంటోంది. మళ్లీ ఆరోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. నాడు ఎక్కడికి వెళ్లినా ఒక జట్టుగా వెళ్లేవాళ్లం. ఒకరింటికి మరొకరం వెళ్తూ సందడి చేసే వాళ్లం. వినాయక చవితి, దసరా, దీపావళి, బోనాలు, బతుకమ్మ, హోలీ పండుగలను మిత్రులతో సంతోషంగా జరుపుకొనేది. చాలా మంది మిత్రులు నేడు ఉపాధ్యాయ వృత్తితో పాటు ఇతర వృత్తుల్లో ఉన్నారు. ఏ హోదాలో ఉన్నా కలుసుకున్నపుడు అనుభూతి ఏర్పడుతోంది.
– శ్రీనివాస్‌రెడ్డి,
సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి
బాల్య స్నేహితుడికి
బాసట
శివ్వంపేట(నర్సాపూర్): బాల్య స్నేహితుడు అనార్యోగంతో మృతిచెందగా తోటి స్నేహితులు మేమున్నామంటూ బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. శివ్వంపేటకు చెందిన శేరిపల్లి గోపాల్ అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. ఇతనికి భార్య ఇద్దరు కుతూళ్లు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన గోపాల్.. వర్గల్‌లోని నవోదయ విద్యాలయంలో 1992–93లో పదో తరగతి పూర్తి చేశాడు. అప్పటి నవోదయ స్నేహితులు గోపాల్ కుటుంబాన్ని ఆదుకున్నారు. స్నేహితులందరూ రూ.3 లక్షలు పోగుచేసి గోపాల్ కుమార్తెలు చందన, అక్షయ పేరిట బ్యాంకులో డిపాజిట్ చేశారు.
మన కోసం నిలబడే వాళ్లే..
మన కోసం నిలబడే వాళ్లే..
మన కోసం నిలబడే వాళ్లే..