
ఆప్తులున్నవారే అసలైన అదృష్టవంతులు
మెదక్ మున్సిపాలిటీ: వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా.. ఎన్ని ఆస్తులున్నా.. ఆప్తులను సంపాదించుకున్న వారే అదృష్టవంతులు. ఎవరి సమక్షంలో మన బాధలు సగం అవుతాయో.. ఎవరి కారణంగా మన ఆనందం రెట్టింపు అవుతుందో వారే అసలైన ఆప్త మిత్రులు. మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడుతున్న ఈ ఆధునిక యుగంలో స్వచ్ఛమైన స్నేహం కోసం తాపత్రయపడే వాళ్లెందరో ఉన్నారు. నేను డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా.. రోజూ స్నేహితులతో పది నిమిషాలు మాట్లాడతా. చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులతో ఇప్పటికీ కలుస్తాను. వారితో మాట్లాడి, ఊరు విషయాలు, కుటుంబ విషయాలు, ఇతర విషయాల గురించి చర్చించుకుంటాం. స్నేహితులతో కలిసి మాట్లాడటం వల్ల ఎంతో రిలీఫ్ ఉంటుంది.
– డీవీ శ్రీనివాసరావు,
ఎస్పీ, మెదక్ జిల్లా