
బడి నిధుల గోల్‌మాల్‌పై విచారణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల దుర్వినియోగంపై జిల్లా విద్యాశాఖ విచారణ చేపట్టింది. మంగళవారం సాక్షిలో ప్రచురితమైన బడి నిధులు గోల్‌మాల్ కథనానికి జిల్లా విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల వ్యయం పై పూర్తి వివరాలు సమర్పించాలని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్‌లను డీఈఓ ఆదేశించారు. అయితే పీఎం శ్రీ నిధుల వినియోగం వివరాలు ఆన్‌లైన్‌లో పంపించాలని కోరడంతో మళ్లీ, పాత లెక్కలే పంపించే అవకాశం ఉందని, ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందువల్ల అధికారులే నేరుగా క్షేత్ర స్థాయిలో విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.