
ప్రకృతిని రక్షించుకుందాం
దుబ్బాకటౌన్: ప్రకృతిని రక్షించుకుందాం.. భవిష్యత్‌ను కాపాడుకుందామని గజ్వేల్ లయ న్స్ క్లబ్ స్నేహ ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమారస్వామి అన్నారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో మొక్కలు నాటి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన పర్యావరణం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్ర మంలో క్లబ్ స్నేహ నాయకులు సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు స్వాతి, విద్యార్థులు తదితరులున్నారు.
భాస్వరం కరిగించే బ్యాక్టిరియా
నంగునూరు(సిద్దిపేట): పొలంలో పేరుకుపోయిన భాస్వరాన్ని కరిగించే బ్యాక్టిరియాను అభివృద్ధి చేయడంతో పంటకు ఎంతో మేలు జరుగుతుందని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి అన్నారు. తోర్నాల ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ముండ్రాయిలో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థులకు పంటల సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పల్లవి మాట్లాడుతూ విత్తన శుద్ధి చేసిన నారు కట్టలను ముంచే పద్ధతిలో పీఎస్‌బీ ద్రావకంలో నానబెట్టి నాటు వేసుకోవాలన్నారు. రెండు కిలోల పీఎస్‌బీ ద్రావకాన్ని పశువుల ఎరుతో కలిపి చల్లడం ద్వారా భాస్వరాన్ని కరిగించే లక్షణం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు దాక్షాయని, అర్చన, గాయత్రి, సుమయ, అలేఖ్యరెడ్డి, రైతు కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నోట్ పుస్తకాల పంపిణీ
మద్దూరు(హుస్నాబాద్): మండల పరిధిలోని లద్నూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రా మానికి చెందిన దాసరి మురళీధర్‌రెడ్డి సోమ వారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పాఠ శాలలో తన తండ్రి లక్ష్మారెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించారన్నారు. తన తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి కృష్ణమ్మల జ్ఞాపకార్థం పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి అందరూ సహాయ సహకారా లు అందించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, కృష్ణా రెడ్డి, పద్మారెడ్డి, భూపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, అనూ ప్‌రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ బాల రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గ్రంథాలయ నిర్వహణపై
అవగాహన
కొండపాక(గజ్వేల్): పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని మండల విద్యాధికారి(ఎంఈఓ) బచ్చలి సత్తయ్య అన్నారు. కుకునూరుపల్లి పాఠశాలల్లో గ్రంథాలయ నిర్వహణ తీరుపై ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలకు విద్యార్థులు అలవాటు పడేలా చూసుకోవాలన్నారు. పుస్తక పఠనం విలువ గురించి విద్యార్థులకు అర్థం చేయించాలని సూచించారు. శిక్షణలో బెస్టు పార్టిసిపెంట్‌గా నిలిచిన బొబ్బాయిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అశ్విని ఘనంగా సత్కరించారు. రిసోర్సు పర్సన్ సత్యకృష్ణ, సీఆర్పీ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అంబులెన్స్‌ల్లో తనిఖీలు
హుస్నాబాద్: జిల్లాలో మొత్తం ఇరువై ఆరు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈఎంఆర్‌ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్‌తో అనుసందానంతో సేవలందిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి కిషోర్ తెలిపారు. పట్టణంలో సోమవారం రెండు 108 అంబులెన్స్‌లు, 102 అమ్మఒడి వాహనాన్ని తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని పరికరాలు, రికార్డులు, పనితీరును పరిశీలించారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. నాణ్యత విభాగంశాఖ తనిఖీ అధికారి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ సాహిద్, జిల్లా మేనేజర్ హరి రామకృష్ణ, పైలెట్ సతీశ్, ఈఎంటీ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.

ప్రకృతిని రక్షించుకుందాం

ప్రకృతిని రక్షించుకుందాం

ప్రకృతిని రక్షించుకుందాం