
ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ కట్
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేటలోని ఐటీ హబ్‌లో మరోసారి ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయాయి. బిల్లు చెల్లించకపోవడం వల్లే ఇంటర్నెట్ కట్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం ఈదురు గాలుల వల్ల కేబుల్ తెగిపోవడంతో సేవలు నిలిచిపోయాయని చెబుతున్నారు. రెండు రోజుల పాటు నెట్ లేకపోవడంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా ద్వితీయ శ్రేణి పట్టణాల చెంతకు వచ్చిన ఐటీ కంపెనీలను మౌలిక వసతుల లేమి, ఇంటర్ నెట్, విద్యుత్ కారణంగా ఇబ్బందులు తప్పడంలేదు.
రెండు రోజులుగా నిలిచిన సేవలు