రోల్ మోడల్‌గా నిలవండి
సిద్దిపేటకమాన్: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించి రోల్ మోడల్‌గా నిలవాలని సీపీ అనురాధ అన్నారు. శిక్షణ పొందుతున్న ప్రొబేషినరీ ఎస్‌ఐలకు సీపీ కార్యాలయంలో సీపీ మంగళవారం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలు పూర్తిగా విని పరిష్కరించాలన్నారు. డయల్ 100కు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు. సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, ప్రొబిషినరీ ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


