హత్నూర(సంగారెడ్డి): రైతులు ప్రతీ ఏటా భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని తగిన మోతాదులో ఎరువులు వాడటం వల్ల పంట దిగుబడి ఎక్కువ వస్తుందని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ పేర్కొన్నారు. హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో సోమవారం రైతులకు వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్త డాక్టర్ అరుణ మాట్లాడుతూ..భూసార పరీక్ష సిఫారసు మేరకు రసాయన ఎరువుల వాడకం మంచిదన్నారు. అనువైన వంగడాల ప్రోత్సాహం ఎంచుకోవచ్చని సూచించారు. ఎల్ నినో వాతావరణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో జోగిపేట ఏడీఏ రమాదేవి, వ్యవసాయ విస్తరణ అధికారులు మనీషా, మహేందర్ ఆత్మ సిబ్బంది, సర్పంచ్ శ్రీహరి, ఉపసర్పంచ్ శంకర్ రైతులు పాల్గొన్నారు.
ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ


