తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం... చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయికిరణ్‌కు తూప్రాన్‌కు చెందిన శోభతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద మిర్చిబండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో నిత్యం సాయికిరణ్ బాధపడేవాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్‌ను తన మిత్రునికి ఇచ్చి చేగుంటలో గ్యాస్ కేవైసీ చేయించాల్సి ఉందని వెళ్లాడు. కానీ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో భార్య శోభ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


