బగలాముఖికి 1011 కలశాలతో అభిషేకం | - | Sakshi
Sakshi News home page

బగలాముఖికి 1011 కలశాలతో అభిషేకం

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

నర్సాపూర్‌ రూరల్‌: శివ్వంపేట మండల కేంద్రంలోని బగలాముఖి అమ్మవారి శక్తి పీఠంలో అమ్మవారి జయంతి సందర్భంగా శుక్రవారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి 1011 కలశాల పసుపు జలాలతో, 111 లీటర్ల ఆవుపాలతో ఆలయ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులకు దాతల సహకారంతో రూ.6 లక్షలతో నిర్మించిన వసతి గృహాన్ని హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త అశోక్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహేశ్‌ గుప్తా, సర్పంచ్‌ వెంకటేశ్‌, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement