పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని నూతన కాలనీలకు రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో గురువారం అశోక్‌రెడ్డిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఆ వివరాలను ఎమెల్యే పటాన్‌చెరులో విలేకరులకు వెల్లడించారు. ప్రధానంగా అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2, సృజనలక్ష్మీ కాలనీ ఫేజ్ 4, టైలర్స్ కాలనీ, లింగమయ్య కాలనీ, కేఎస్‌ఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత వేసవిలో ప్రతీ రోజు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. ఆ కాలనీల్లో నూతన పైపులైన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశారని తెలిపారు. రూ.2 కోట్ల నిధులు మంజూరు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అశోక్‌రెడ్డి.. అతి త్వరలో నిధుల మంజూరు చేస్తామన్నారని ఎమ్మెల్యే వివరించారు.
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని
కోరిన ఎమ్మెల్యే గూడెం


