
బంద్ విజయవంతం చేయాలి
వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన బీసీ జేఏసీ నేతలు
సంగారెడ్డి : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. పార్టీలకతీతంగా జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అంతకుముందు బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసి చైర్మన్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెబుదామన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, గోకుల్ రృష్ణ, వైస్ చైర్మన్ గోరుగంటి రమేశ్ కుమార్, వర్కింగ్ చైర్మన్ కుమ్మరి సాయిలు, నాయకులు హరికిషన్, కో–కన్వీనర్ పి.కృష్ణమూర్తి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: బీసీ రిజర్వేషన్ 42% అమలు కోసం ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్‌కు పీడీఎస్‌యూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ...బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నం.9 ను హైకోర్టు కొట్టి వేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ జేఏసీ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను చేర్చడం ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లను సాకారం చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, జిల్లా నాయకులు శ్రీకాంత్,పవన్, అభిషేక్, శైలజ తదితరులు పాల్గొన్నారు.