
విద్యతోపాటు క్రీడలు ముఖ్యమే
పటాన్‌చెరు: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పటాన్ చెరు మైత్రి క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి 69 వఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలను గురువారం కలెక్టర్ ప్రావీణ్య క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ...క్రీడాకారులకు ఈ మూడు రోజులు అత్యంత కీలకమని ఈ క్రీడల్లో రాణిస్తే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. చదువుతోపాటు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఈ క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో పతకాల సంఖ్య పెంచేందుకు క్రీడాకారులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక దృఢత్వంతోపాటు విద్య,ఉపాధి అవకాశాల్లో అవకాశాలు వస్తాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు ఎస్పీ పరితోశ్ పంకజ్ శుభాకాంక్షలు తెలిపారు.
పౌష్టికాహారలోప నివారణకు
పోషణ అభియాన్
పటాన్‌చెరు టౌన్: పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి పోషణ అభియాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పటాన్‌చెరులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓ జయరాం నాయక్ పాల్గొన్నారు.
69వ ఎస్‌జీఎఫ్ క్రీడోత్సవాల్లో కలెక్టర్ ప్రావీణ్య
కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో పతకాల సాధనకు కృషి చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు