
డీసీసీ పదవికి అభిప్రాయ సేకరణ
జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షపదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. శుక్రవారం జహీరాబాద్‌లోని ఎస్‌వీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పార్టీ అధిష్టానవర్గం నిర్ణయించిన రిజర్వేషన్ వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం బ్లాకుల వారీగా ముఖ్యనేతలతో ప్రత్యేక గదిలో సమావేశమయ్యారు. వారి నుంచి వ్యక్తిగత వివరాలు తీసుకుని నమోదు చేశారు. ఈ సమావేశంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలకు సంబంధించిన పేర్లను పార్టీ నాయకులు ప్రస్తావించినట్లు తెలిసింది. బ్లాక్ స్థాయి నేతల సమావేశం పూర్తయ్యాక మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలతో సైతం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. సేకరించిన వివరాలను అధిష్టానవర్గానికి పంపిస్తామని సిజరిట తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, కేతకీ చైర్మన్ చంద్రశేఖర్, సీడీసీ చైర్మన్ ముబీన్, మాజీ జెడ్పీటీసీలు భాస్కర్‌రెడ్డి, నాగిశెట్టిరాథోడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుం, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేతకీలో పూజలు
కేతకీ సంగమేశ్వరాలయాన్ని సిజరిట సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆమెకు మండల కాంగ్రెస్ శ్రేణులతోపాటు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు. అనంతరం పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు పాటిల్, నాయకులు రాజ్ కుమార్ స్వామి, సంగమేశ్వర్, రామ్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేతలతో సమావేశమైనఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట